Stock Market: కొత్త వైరస్ భయాలు... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 1,258 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 388 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 4.41 శాతం నష్టపోయిన టాటా స్టీల్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా తర్వాత ఆ స్థాయిలో మరోసారి వైరస్ ప్రభావం మొదలయింది. చైనాలో పుట్టిన కొత్త వైరస్ కేసులు ఇండియాలో నమోదు కావడంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,258 పాయింట్లు కోల్పోయి 77,964 వద్ద ముగిసింది. నిఫ్టీ 388 పాయింట్లు పతనమై 23,616కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (0.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.26%), సన్ ఫార్మా (0.01%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-4.41%), ఎన్టీపీసీ (-3.65%), కొటక్ బ్యాంక్ (-3.26%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.19%), జొమాటో (-2.95%).