Pushpa 2: భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1,831 కోట్ల వసూళ్లతో 'పుష్ప-2' రికార్డు!
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప-2: ది రూల్'
- డిసెంబరు 4న ప్రీమియర్స్ షోలతో ఇండియన్ బాక్సాఫీస్‌పై మొదలైన మూవీ దండయాత్ర
- 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు
- రూ.1,831 కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన 'పుష్ప-2'
- 'బాహుబలి-2' వసూళ్లను దాటేసిన 'పుష్ప-2'
డిసెంబరు 4న ప్రీమియర్స్ షోలతో ఇండియన్ బాక్సాఫీస్‌పై మొదలైన 'పుష్ప-2: ది రూల్' వసూళ్ల రికార్డుల దండయాత్ర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును సృష్టించింది. 32 రోజుల్లో 1,831 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రూ. 1,810 కోట్లు రాబట్టిన 'బాహుబలి-2' వసూళ్లను దాటేసిన 'పుష్ప-2' కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో 'పుష్ప-2: ది రూల్' రూపొందింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం.. ప్రీమియర్స్ నుంచే బ్లాకబస్టర్ టాక్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్‌కు ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది.
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో రూ. 1,831 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించారు. విదేశీ కెమెరామన్ కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు.