Actor Vishal: హీరో విశాల్‌కు ఏమైందంటూ అభిమానుల ఆందోళన.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన వైద్యులు!
- సంక్రాంతి బరిలో విశాల్ నటించిన 'మదగజ రాజా' చిత్రం
- తాజాగా చెన్నైలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈవెంట్‌కు వచ్చిన విశాల్‌ను చూసి అందరూ షాక్
- గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయిన హీరో
- వేదికపై మాట్లాడే సమయంలో వణికిపోతూ కనిపించిన వైనం
- విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడన్న వైద్యులు
తమిళ హీరో విశాల్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతుంటాయి. తెలుగు ప్రేక్షకులు ఆయనను తెలుగు హీరోగానే భావిస్తారు. ఇక ఆయన నటించిన మదగజ రాజా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు సంక్రాంతికి తీసుకువస్తున్నారు.
తాజాగా చెన్నైలో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విశాల్ హాజరయ్యారు. కానీ ఈవెంట్‌లో ఆయనను చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడటం కనిపించింది. ముఖం కూడా పూర్తిగా మారిపోయింది. బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై మాట్లాడే సమయంలో వణికిపోతూ కనిపించాడు. దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విశాల్ కి ఏమైందంటూ? అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైద్యులు ఆయన హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. దాని ప్రకారం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అందుకే ఆయనకు చికిత్స కొనసాగుతోందని, ప్రస్తుతం పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకుని మునిపటిలా యాక్టివ్ గా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.