KTR: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏసీబీ
- ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఏసీబీ
- ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
- న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఈరోజు విచారణకు హాజరుకాని కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.
కేటీఆర్ ఈరోజు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరు కావాలని భావించారు. అయితే ఏసీబీ అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు. ఒక్కరినే విచారిస్తామని, న్యాయవాదిని అనుమతించేది లేదని చెప్పారు. దీంతో కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లారు. దీంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.