HMPV: దేశంలో మూడో హెచ్ఎంపీవీ కేసు నమోదు... ఈసారి గుజరాత్ లో!

 Third HMPV case identified in Gujarat

  • బెంగళూరులో తొలుత రెండు పాజిటివ్ కేసులు
  • తాజాగా గుజరాత్ లో మరో కేసు
  • ముగ్గురూ చిన్నారులే!

చైనాలో విస్తృతంగా ప్రబలుతున్నట్టు భావిస్తున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ వ్యాప్తి భారత్ లోనూ మొదలైంది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ నిర్ధారణ కాగా, తాజాగా గుజరాత్ లోనూ ఓ చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్టు వెల్లడైంది. దాంతో, భారత్ లో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. 

కర్ణాటకలో మూడు నెలల పసికందుకు, ఆరు నెలల బాబుకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయింది. ఆరు నెలల బాలుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేస్తే హెచ్ఎంపీవీ వైరస్ అని తేలింది. 

ఇక, గుజరాత్ లోనూ ఓ చిన్నారి ఈ వైరస్ బారినపడ్డాడు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న రెండు నెలల పసిబిడ్డను గత డిసెంబరు 24న అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. 

కాగా, అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం... హెచ్ఎంపీవీ వైరస్ ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యవస్థల్లో ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. దాంతో, ఇది చూడ్డానికి ఫ్లూ, సాధారణ జలుబు లాగానే అనిపిస్తుంది.

  • Loading...

More Telugu News