KTR: కేటీఆర్ ఇంటికి చేరుకున్న హరీశ్ రావు, ఇతర కీలక నేతలు
- ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్
- కాసేపట్లో తీర్పును వెలువరించనున్న హైకోర్టు
- హైకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. మరోవైపు నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రి హరీశ్ రావుతో పాలు బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు చేరుకున్నారు.