KTR: కేటీఆర్ అరెస్ట్ పై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. దూకుడు పెంచనున్న ఏసీబీ, ఈడీ!

TG High Court lifts stay on KTR arrest

  • కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
  • కేటీఆర్ నివాసానికి చేరుకున్న కవిత, హరీశ్, కీలక నేతలు
  • కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్న న్యాయ నిపుణులు

ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురయింది. కేసును కొట్టివేయాలంటూ ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తి వేసింది. దీంతో, ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు చెపుతున్నారు. మరోవైపు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. 

ఇంకోవైపు, నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్దకు హరీశ్ రావు, కవిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. కేటీఆర్ నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచారు. పార్టీ కార్యకర్తలను పోలీసులు అనుమతించడం లేదు. కేటీఆర్ నివాసం వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. 

  • Loading...

More Telugu News