Allu Arjun: రేవతి భర్తను కలిసేందుకు అల్లు అర్జున్ ని అనుమతించని పోలీసులు.. కారణం ఇదే!

Police not allowed Allu Arjun to meet Revathi husband

  • కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
  • 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న బన్నీ
  • కేసు కోర్టులో ఉన్నందున రేవతి భర్తను కలిసేందుకు అనుమతించని పోలీసులు

సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ్ ని సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన... చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలోని 14వ ఫ్లోర్ లోని ఐసీయూలో శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్ ని పోలీసులు తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి బన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అల్లు అర్జున్ దాదాపు 20 నిమిషాల పాటు ఉన్నారు. 

ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. మరోవైపు శ్రీతేజ్ తండ్రి, మృతురాలు రేవతి భర్త భాస్కర్ ని కలిసేందుకు బన్నీని పోలీసులు అనుమతించలేదు. కేసు కోర్టులో ఉన్న కారణంగా రేవతి భర్తను, ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించలేదు.

  • Loading...

More Telugu News