Krishnamachari Srikanth: శుభ్ మన్ గిల్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Krishnamachari Srikanth Sensational Comments On Shubhman Gill

  • గిల్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న కృష్ణమాచారి శ్రీకాంత్
  • కొత్త కుర్రాళ్లను పక్కన పెడుతున్నారని విమర్శ
  • టీమిండియా సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన శ్రీకాంత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్యం, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమణ నేపథ్యంలో టీమిండియా సెలెక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. 

శుభ్ మన్ గిల్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పదే పదే విఫలమవుతున్నప్పటికీ జట్టులో చోటు కల్పిస్తున్నారని విమర్శించాడు. ఇందుకోసం ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారంటూ చెప్పాడు. తాజాగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ గిల్ విఫలమయ్యాడని గుర్తుచేస్తున్నాడు. ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఇన్నింగ్స్ లలో గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడని శ్రీకాంత్ చెప్పాడు. 

గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఈ విషయం తాను ప్రతిసారీ చెబుతున్నప్పటికీ ఎవరూ వినడంలేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ సత్తా ఉన్న ఆటగాడని, అతడి టెక్నిక్ బాగుంటుందని మెచ్చుకున్నాడు. యాదవ్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, ఇండియా 'ఎ' టూర్‌లలో మెరుస్తున్న సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. ప్రతిభ కలిగిన యువ ప్లేయర్లను ప్రోత్సహించాలని కృష్ణమాచారి శ్రీకాంత్‌ చెప్పాడు.

  • Loading...

More Telugu News