Chandrababu: కుప్పంలో జన నాయకుడు పోర్టల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu launches Jana Nayakaudu Center in Kuppam

  • సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
  • కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన అధినేత
  • జన నాయకుడు కేంద్రం ప్రారంభించి, పనితీరుపై పరిశీలన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు పోర్టల్ ను, సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. 

కుప్పం ప్రజలు తమ సమస్యలపై జన నాయకుడు కేంద్రంలో వినతిపత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారు. 

నేడు ఈ జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... పనితీరును పరిశీలించారు. జన నాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా, త్వరలో రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు.

నేరుగా ముఖ్యమంత్రి పరిశీలించేలా...

ప్రతి అర్జీ, పరిష్కారం ఎంత వరకు వచ్చిందనేది నేరుగా సీఎం చూసేలా జన నాయకుడు పోర్టల్ లో డాష్ బోర్డ్‌ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయా...లేదా అన్నదాన్ని సీఎం ప్రత్యక్షంగా చూడొచ్చు. నేరుగా జన నాయకుడు కేంద్రానికి రాలేని వాళ్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. 

అదేవిధంగా జన నాయకుడు పోర్టల్ లో నమోదైన సమస్యల పరిష్కారంపై కాల్ సెంటర్ నుంచి అర్జీదారులకు ఫోన్ చేసి వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. సంతృప్తిగా ఉన్నారా...అసంతృప్తిగా ఉన్నారా...అసంతృప్తిగా ఉంటే దానికి గల కారణాలను తెలుసుకుంటారు. మీడియాలో వచ్చే ప్రజాసమస్యలను కూడా గుర్తించి సూమోటోగా జననాయకుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

  • Loading...

More Telugu News