KTR: 'నా మాట‌లు రాసిపెట్టుకోండి'... కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌!

BRS Working President KTR Interesting Tweet goes Viral on Social Media

  • ఫార్ములా ఈ-కారు రేసు కేసులో వేగంగా మారుతున్న ప‌రిణామాలు
  • ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్
  • ఎదురుదెబ్బ‌ల నుంచి బలంగా పుంజుకుంటామ‌న్న మాజీ మంత్రి
  • నేటి అడ్డంకులే రేప‌టి విజ‌యానికి నాంది అన్న కేటీఆర్‌

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. హైకోర్టు ఆయ‌న దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌ను కొట్టివేసింది. అలాగే ఈడీ మ‌రోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇచ్చింది. ఇలా ఈ కేసు వ్య‌వ‌హారంలో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా కేటీఆర్ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. "నా మాట‌లు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బ‌ల నుంచి బలంగా పుంజుకుంటాం. మీ అబ‌ద్ధాలు న‌న్ను అడ్డుకోలేవు. మీ ఆరోప‌ణ‌లు న‌న్ను త‌గ్గించ‌లేవు. మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచలేవు. మీ కుట్ర‌లు నా నోరు మూయించ‌లేవు. నేటి అడ్డంకులే రేప‌టి విజ‌యానికి నాంది. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది. నేను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమవ్వనుంది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News