Stock Market: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
  • 234 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 91 పాయింట్ల పెరిగిన నిఫ్టీ

చైనా కొత్త వైరస్ దెబ్బకు నిన్న భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన సూచీలు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు లాభపడి 78,199కి చేరుకుంది. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకుని 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు క్షీణించి రూ. 85.73కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
టాటా మోటార్స్ (2.25%), రిలయన్స్ (1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.44%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.28%), ఏసియన్ పెయింట్ (1.10%).

టాప్ లూజర్స్:
జొమాటో (-4.59%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.73%), టీసీఎస్ (-1.62%), టెక్ మహీంద్రా (-0.94%), మారుతి (-0.37%).

  • Loading...

More Telugu News