Arvind: తీహార్ జైలా, లేక చంచల్ గూడ జైలా... కేటీఆర్ నిర్ణయించుకోవాలి: ఎంపీ అర్వింద్

MP Arvind satires on KTR

  • ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై ఆరోపణలు
  • విచారణ జరుపుతున్న ఏసీబీ, ఈడీ
  • ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ కేటీఆర్ అంటూ ఎంపీ అర్వింద్ విమర్శలు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణ ఎదుర్కొంటుండడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేటీఆర్, కవితకు ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ కేటీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబమేమీ చట్టానికి అతీతం కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇంకా ఎన్నిసార్లు తప్పించుకుని తిరుగుతారు? అని ప్రశ్నించారు. 

తీహార్ జైలా లేక చంచల్ గూడా జైలా... కేటీఆర్ నిర్ణయించుకోవాలని అర్వింద్ వ్యంగ్యం ప్రదర్శించారు. కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం అభద్రతాభావంతో ఉందని వ్యాఖ్యానించారు. 

అటు, తెలంగాణ బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని అర్వింద్ ఖండించారు. గత ప్రభుత్వ సంస్కృతినే కాంగ్రెస్ కూడా అవలంబిస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News