Uttar Pradesh: యూపీలో షాకింగ్ ఘ‌ట‌న‌.. ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ను వ‌దిలేసి బిచ్చ‌గాడితో పారిపోయిన మ‌హిళ‌!

UP Woman Elopes With Beggar Found After Husband 6 Children Go To Cops

  • యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఘ‌ట‌న
  • భ‌ర్త ఫిర్యాదు మేర‌కు బీఎన్ఎస్‌ సెక్షన్ 87 కింద పోలీసుల కేసు న‌మోదు 
  • పారిపోయిన జంట కోసం పోలీసుల గాలింపు
  • మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. బిచ్చ‌గాడి కోసం వెతుకుతున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ మ‌హిళ త‌న ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ను వ‌దిలేసి ఓ బిచ్చ‌గాడితో పారిపోయింది. దాంతో భ‌ర్త పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. భ‌ర్త ఫిర్యాదు మేర‌కు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లోని సెక్షన్ 87 కింద కేసు న‌మోదు చేశారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.   

వివ‌రాల్లోకి వెళితే..  రాజు (45) అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి (36), ఆరుగురు పిల్లలతో కలిసి హర్దోయ్‌లోని హర్పాల్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో నాన్హే పండిట్ (45) అనే బిచ్చ‌గాడు భిక్షాటన చేసేవాడు. అయితే, అత‌డు తరచూ రాజేశ్వరితో మాట్లాడేవాడు. చివ‌రికి వారు ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవ‌ర‌కు వెళ్లార‌ని రాజు చెప్పాడు.

ఈ క్ర‌మంలో జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజేశ్వరి బట్టలు, కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్‌కి వెళుతున్నానని త‌న‌ కూతురు ఖుష్బూకు చెప్పి బ‌య‌ట‌కు వెళ్లింది. కానీ, ఆమె ఎంత‌కు తిరిగి రాకపోవడంతో రాజు చుట్టుప‌క్క‌ల అంతా వెతికాడు. ఎక్క‌డా ఆమె ఆచూకీ దొర‌క‌లేదు. 

అదే స‌మ‌యంలో త‌న‌ గేదెను విక్ర‌యించ‌గా వ‌చ్చిన‌ డబ్బు కూడా ఇంట్లో క‌నిపించ‌లేదు. దాంతో అనుమానం వ‌చ్చి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఆమె ఇంట్లోని డబ్బు తీసుకుని నాన్హే పండిట్‌తో వెళ్లిపోయి ఉండొచ్చ‌ని రాజు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

రాజు ఫిర్యాదు మేర‌కు బీఎన్ఎస్‌ సెక్షన్ 87 కింద కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బిచ్చ‌గాడు నాన్హే పండిట్, రాజేశ్వ‌రి కోసం వెతికారు. ఈ క్ర‌మంలో రాజేశ్వ‌రి ఆచూకీ పోలీసుల‌కు దొరికింది. దాంతో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి శిల్పా కుమారి తెలిపారు. అలాగే ప‌రారీలో ఉన్న నాన్హే పండిట్ కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.   

  • Loading...

More Telugu News