Supreme Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు

SC Collegium recommends transfers of Chief Justices of Telangana and Bombay HCs

  • బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఢిల్లీకి
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరాధే బొంబాయికి బదిలీ
  • సిఫార్సు చేసిన  సుప్రీం కోర్టు కొలీజియం

సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని నేడు సిఫార్సు చేసింది. 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అరాధే, 2009 డిసెంబరులో మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023 జూలై 23న ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

అదే విధంగా, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. 1965 జూన్ 16న జన్మించిన జస్టిస్ ఉపాధ్యాయ, 2011 నవంబరులో అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 ఆగస్టులో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023 జూలై 29న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News