Iam Kathalan: ప్రియురాలి తండ్రిపై పగ .. 'ప్రేమలు' హీరో నుంచి మరో హిట్ మూవీ .. ఓటీటీలో!

Iam Kathalan Movie Update

  • మలయాళంలో రూపొందిన 'ఐయామ్ కాథలన్'
  • నవంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
  • నెస్లెన్ కి దక్కిన మరో హిట్ 
  • ఈ నెల 17 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ 

క్రితం ఏడాది మలయాళంలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో 'ప్రేమలు' ముందు వరుసలో కనిపిస్తుంది. నస్లెన్ కె గఫూర్ హీరోగా గిరీశ్ తెరకెక్కించిన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. కేవలం 3 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 136 కోట్లను రాబట్టడం ఒక రికార్డు. అలాంటి ఈ కాంబినేషన్లో రూపొందిన మరో సినిమానే 'ఐ యామ్ కాథలన్'.

'ఐయామ్ కాథలన్' సినిమా క్రితం ఏడాది నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీని టచ్ చేస్తూ సాగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుంది. లిజోమోల్ జోస్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, దిలీష్ పోతన్ కీలకమైన పాత్రను పోషించాడు. సిద్ధార్థ్ ప్రదీప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా 'మనోరమా మ్యాక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. 

కథ విషయానికి వస్తే .. విష్ణు (నెస్లెన్) బీటెక్ చదువుతూ ఉంటాడు. అతను 'సిమీ' (లిజోమోల్ జోస్)ను ప్రేమిస్తాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. సిమీ తనని అర్థం చేసుకోకపోవడం .. ఆమె తండ్రి 'చాకో' (దిలీష్ పోతన్) తనని అవమానించడాన్ని విష్ణు తట్టుకోలేకపోతాడు. హ్యాకింగ్ చేయడంలో తనకి గల టాలెంటును ఉపయోగించి, సిమీ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేయాలని నిర్ణయించుకుంటాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.

  • Loading...

More Telugu News