Suresh: సినీ నటి నదియాతో ప్రేమపై నటుడు సురేశ్ స్పందన

Suresh response on love with Nadiya

  • 270కి పైగా సినిమాల్లో నటించిన సురేశ్
  • అప్పట్లో నదియాతో ప్రేమాయణం సాగించినట్టు ప్రచారం
  • నదియా తనకు చెల్లెలు వంటిదన్న సురేశ్

సీనియర్ సినీ నటుడు సురేశ్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలతో మెప్పించారు. తన కెరీర్లో 270కి పైగా సినిమాలు చేశారు. తమిళంలో సైతం సత్తా చాటారు. అప్పట్లో హీరోయిన్ గా ఉన్న నదియాతో సురేశ్ ప్రేమ వ్యవహారం నడిపాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. నదియా ప్రస్తుతం సీనియర్ నటిగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నదియాతో తనకు అఫైర్ ఉందంటూ వచ్చిన రూమర్స్ పై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేశ్ స్పందించారు. 

నదియా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెతో తాను చాలా చిత్రాలు చేశానని సురేశ్ తెలిపారు. నదియాకు బోయ్ ఫ్రెండ్ ఉండేవాడని... ఆయన పేరు శిరీష్ అని చెప్పారు. షూటింగ్ సమయంలో ఆమె తన బోయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడుతుండేదని తెలిపారు. శిరీష్, సురేశ్ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో... నదియా బోయ్ ఫ్రెండ్ తానే అని అందరూ అనుకునేవారని చెప్పారు. 

నదియా తనకు చెల్లెలు వంటిదని, ఆమెతో అఫైర్ కు అవకాశమే లేదని సురేశ్ అన్నారు. శిరీష్ ను పెళ్లి చేసుకుని నదియా లైఫ్ లో సెటిల్ అయిపోయిందని చెప్పారు. తాము ఇప్పటికీ స్నేహితులమేనని అన్నారు.

  • Loading...

More Telugu News