Ramcharan: గేమ్ ఛేంజర్ కు రామ్ చరణ్ పారితోషికం ఎంతంటే..!

Ram Charan Tej Remuneration for Game Changer Movie

  • టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల జాబితాలో చెర్రీ
  • ఒక్కో సినిమాకు రూ. వంద కోట్లు తీసుకుంటారని ప్రచారం
  • తాజా సినిమా గేమ్ ఛేంజర్ కు మాత్రం రూ.65 కోట్లే తీసుకున్నారట

టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటులలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకరు.. ఒక్కో సినిమాకు ఆయన రూ. 90 నుంచి 100 కోట్ల వరకు తీసుకుంటారని సమాచారం. అయితే, తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’ కు మాత్రం రామ్ చరణ్ తన పారితోషికం తగ్గించుకున్నాడట. ఈ సినిమాకు రూ.65 కోట్లు మాత్రమే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు శంకర్ రూ.35 కోట్లు తీసుకున్నారని సినీవర్గాల సమాచారం.

దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ నెల 10న థియేటర్లకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. పాటలు, పోస్టర్స్ అన్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండడంతో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ పై చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ కు సంబంధించి ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

  • Loading...

More Telugu News