Razakar: ఓటీటీలోకి అడుగుపెడుతున్న 'రజాకార్'

Razakar movie update

  • క్రితం ఏడాది మార్చిలో వచ్చిన 'రజాకార్'
  • ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ 
  • ఆలస్యంగానే ఓటీటీకి వచ్చిన సినిమా 
  • ఈ నెల 24వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్


తెలంగాణ చరిత్రపై చెరిగిపోని ఓ నెత్తురు మరక 'రజాకార్'. అప్పటి రజాకారులు తెలంగాణలోని హిందువులపై సాగించిన మారణకాండను ఈ నేల ఇంకా మరిచిపోలేదు. అలాంటి ఒక నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కిన సినిమానే 'రజాకార్'. క్రితం ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే అనేక కారణాల వలన ఈ సినిమాకి ఆశించిన స్థాయి ఆదరణ లభించలేదు. 

అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై అడుగుపెడుతుందా అని చాలా కాలంగా చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లకు రావడానికే అనేక అవాంతరాలను దాటవలసి వచ్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా అలాంటి పరిస్థితినే ఎదురైంది. ఆటంకాలను దాటుకుని, ఈ నెల 24వ తేదీన ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు కూడా. 

ఆనాటి అమానుష శక్తిగా చెప్పుకునే 'రజాకార్' సాగించిన అరాచకాన్ని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన కంటెంట్ ఇది. నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఇంద్రజ .. అనసూయ .. బాబీ సింహా .. రాజ్ అర్జున్ ప్రధానమైన పాత్రలను పోషించారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News