Japan Tourists: సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకన్నను దర్శించుకున్న జపాన్ దేశస్తులు... వీడియో ఇదిగో
- తిరుమలో సందడి చేసిన జపాన్ టూరిస్టులు
- హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ
- జపాన్ దేశస్తులను ఆసక్తిగా తిలకించిన ఇతర భక్తులు
విదేశీయులు భారతీయ ఆచార సంప్రదాయాలు పట్ల మక్కువ చూపడం ఎప్పట్నించో జరుగుతోంది. ముఖ్యంగా, పలు దేశాలకు చెందిన హైందవ ధర్మం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు.
తాజాగా, కొందరు జపాన్ దేశస్తులు తిరుమలలో సందడి చేశారు. భారత సంప్రదాయాలను ప్రతిబించేలా దుస్తులు ధరించిన ఆ జపనీయులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. జపాన్ వాళ్లు చీరలు, పంచె కట్టులో రావడంతో ఇతర భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. జపాన్ భక్త బృందంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.