TTD: తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో స్పందన ఇలా..!

ttd eo visited hospital

  • పద్మావతి వైద్య కళాశాలలో క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు
  • డీఎస్పీ గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట ఘటన చోటుచేసుకుందన్న ఈవో శ్యామలరావు
  • విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయన్న ఈవో

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆయన ఈ ఘటనలో 41 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. కొందరిని ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు డిశ్చార్జి చేశారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందుతోందని చెప్పారు. 

  • Loading...

More Telugu News