Chandrababu: దావోస్‌కు వెళ్లే చంద్రబాబు టీమ్ లో ఎవరెవరుంటారంటే...!

cm chandrababus team to visit davos
  • ఈ నెల 20 నుంచి 24 వరకూ సీఎం దావోస్ లో పర్యటన
  • ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
  • సీఎం బృందంలో మొత్తం 9 మంది 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ దావోస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో చంద్రబాబు నేతృత్వంలో తొమ్మిది మంది బృందం పాల్గొననుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. 

రాష్ట్రంలో వనరులు, పెట్టుబడి అవకాశాలను వీరు ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని దావోస్ పర్యటన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సీఎం సెక్యూరిటీ అధికారి శ్రీనాథ్ బండారు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ, కాడా పీడీ వికాస్ మర్మత్ ఉండనున్నారు.
Chandrababu
Davos
Chandrababu dovos tour
Nara Lokesh

More Telugu News