Sai Pallavi: స్టార్ హీరోతో అవకాశం వదులుకున్న సాయిపల్లవి... కారణం ఇదే!

Sai Pallavi rejects Vikram movie
  • కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్
  • ఆ డేట్స్ లో కాల్షీట్స్ లేకపోవడంతో అవకాశాన్ని వదులుకున్న సాయి పల్లవి
  • వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' సినిమాలో నటించనున్న నేచురల్ బ్యూటీ
హీరోయిన్ సాయి పల్లవిని అభిమానులు ముచ్చటగా నేచురల్ బ్యూటీ అని పిలుచుకుంటుంటారు. మిగతా హీరోయిన్ల మాదిరి ఆమె విపరీతమైన మేకప్ తో ఎప్పుడూ కనిపించదు. బ్యూటీ కాస్మొటిక్స్ కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసడర్ గా తీసుకోవాలనుకున్నా... ఆమె సున్నితంగా తిరస్కరించింది. తాను మేకప్ వస్తువులు వాడనని... అలాంటప్పుడు తాను ఇలాంటి ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేయలేనని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. 

సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఎంతో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమెకు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో అవకాశం వచ్చింది. విక్రమ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, సాయి పల్లవి ఆ ఛాన్స్ ను వదులుకుంది. ఆమెకు ఆ డేట్స్ లో కాల్షీట్స్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకుంది. 

'బలగం' మూవీతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న వేణు 'ఎల్లమ్మ' మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించబోతున్నాడు. కథానాయిక పాత్ర చాలా ప్రధానంగా ఉండే ఈ సినిమాకు సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కథ నచ్చడంతో ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో వేణు మరో హిట్ కొడతాడనే అంచనాలు ఉన్నాయి.
Sai Pallavi
Vikram
Tollywood
Kollywood

More Telugu News