Type 2 Diabetes: కూల్‌డ్రింక్స్‌తో ఏడాదికి 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు!

22 lakh Type 2 Diabetes Cases Every Year Due To Cool Drinks
  • అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • మధుమేహానికి అదనంగా గుండె జబ్బులు కూడా
  • 2020లో నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం కూల్‌డ్రింక్స్ వల్లే!
పార్టీ, ఫంక్షన్.. ఏదైనా కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే. ఏ ఇద్దరు కలిసినా కూల్‌డ్రింక్ కడుపులోకి వెళ్లాల్సిందే. ఇక ప్రయాణాల్లో వాటి వినియోగం గురించి చెప్పక్కర్లేదు. శీతల పానీయాలను అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం చెడుతుందన్న విషయం తెలిసినా చాలామంది నియంత్రించుకోలేరు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం కూల్‌డ్రింక్ పేరెత్తడానికే భయపడిపోతారు. 

శీతల పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడుతున్నారట. అంతేకాదు, 12 లక్షల మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం మంది తీపి పానీయాలు తీసుకోవడం వల్లే దీని బారినపడినట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.  
Type 2 Diabetes
Cool Drinks
Tufts University
Health News

More Telugu News