Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసుల‌ మోహరింపు.. కార‌ణ‌మిదే!

Police Deployed at Mohan Babu University in Tirupati
  • యూనివ‌ర్సిటీకి మంచు మ‌నోజ్ వ‌స్తున్నార‌నే స‌మాచారంతో అప్ర‌మ‌త్త‌మైన‌ పోలీసులు
  • ఇప్ప‌టికే యూనివ‌ర్సిటీలో ఉన్న‌ మోహ‌న్ బాబు, మంచు విష్ణు
  • దీంతో ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా పోలీసుల చ‌ర్య‌లు
తిరుప‌తిలోని మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీ వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. యూనివ‌ర్సిటీకి మంచు మ‌నోజ్ వ‌స్తున్నార‌నే స‌మాచారంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇప్ప‌టికే యూనివ‌ర్సిటీలో మోహ‌న్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు యూనివ‌ర్సిటీ గేటు వ‌ద్ద వేచి ఉన్నారు. 

ఇక మంచు మ‌నోజ్ కుటుంబ స‌మేతంగా హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి చేరుకుని, రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బ‌య‌ల్దేరారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు యూనివ‌ర్సిటీ ప‌రిస‌రాల్లో ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. 

గేట్ల‌ను కూడా మూసివేయ‌డంతో యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అస‌లేం జ‌రుగుతుందా? అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ గొడ‌వ‌లు తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. తండ్రీకొడుకులు ఒక‌రిపై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకునే వ‌ర‌కు వెళ్లారు.     
Mohan Babu University
Tirupati
Andhra Pradesh
Manchu Manoj

More Telugu News