Manchu Manoj: ఇదంతా విష్ణు ఆడుతున్న నాటకమే... నాన్నను నేను వ్యతిరేకించలేదు: మంచు మనోజ్

Everything happening because of Vishnu says Manchu Manoj
  • తమ కుటుంబంలో ఆస్తుల వివాదాలు లేవన్న మనోజ్
  • యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై తాను ప్రశ్నించానని వెల్లడి
  • విద్యార్థులు, తన కుటుంబం కోసమే తన పోరాటమని వ్యాాఖ్య
జల్ పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని... వారిని ఖాళీ చేయించి తమ ఆస్తులను తమకు అప్పగించాలని రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ను మంచు మనోజ్ కలిశారు. తమ కుటుంబంలో భూతగాదాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మీడియాతో మనోజ్ మాట్లాడుతూ... తమ కుటుంబంలో ఆస్తుల వివాదాలు లేవని చెప్పారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకే తన అన్న విష్ణు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నాన్నను అడ్డం పెట్టుకుని విష్ణు నాటకం ఆడుతున్నారని చెప్పారు. నాన్నను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. విద్యార్థులు, తన కుటుంబం, బంధువుల కోసమే తన పోరాటమని చెప్పారు. తనకు న్యాయం దక్కేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Manchu Manoj
Manchu Vishnu
Tollywood

More Telugu News