IIT Madras: గోమూత్రం ఔషధం.. తాగితే జ్వరం తగ్గుతుంది: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్

Drinking cow urine will cure diseases says Madras IIT director
--
గోమూత్రం అతిపెద్ద ఔషధమని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రొఫెసర్ వి కామకోటి పేర్కొన్నారు. మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి గోమూత్రానికి ఉందన్నారు. గోమూత్రం సేవిస్తే జ్వరం తగ్గుతుందని చెప్పారు. ఈమేరకు చెన్నైలో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో కామకోటి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్ కామకోటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నెల 15న కనుమ పండుగ సందర్భంగా వెస్ట్ మాంబళంలోని ఓ గోశాలలో నిర్వాహకులు పూజలు చేశారు. ఈ పూజలకు ప్రొఫెసర్ కామకోటి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కామకోటి మాట్లాడుతూ.. ఓసారి తన తండ్రికి జ్వరం వస్తే ఓ సన్యాసిని ఆశ్రయించారని, వైద్యుడి వద్దకు వెళ్లే విషయంపై ఆయన సలహా అడిగారని చెప్పారు. జ్వరానికి వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని చెబుతూ గోమూత్రం తాగాలని ఆ సన్యాసి సూచించారని వివరించారు. తన తండ్రి గోమూత్రం సేవించిన పదిహేను నిమిషాల్లోనే జ్వరం తగ్గిందని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాను అవి అంతం చేస్తాయని ప్రొఫెసర్ కామకోటి వివరించారు.
IIT Madras
IIT Director
Prof Kamakoti
Cow Urine
Fever

More Telugu News