RS Praveen Kumar: రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు

RS Praveen Kumar complaint against Revanth reddy in Narsingi PS
  • ఫార్ములా ఈ-రేస్ కేసులో రేవంత్ రెడ్డివి అనాలోచిత చర్యలు అన్న ఆర్ఎస్పీ
  • సీఎం తీరు వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆగ్రహం
  • సీఎంపై కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎంపై ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులు ఉన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, కాబట్టి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లాలన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులను ముందుకు తీసుకువెళ్లకుండా నిధులు వృథా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి నిందితుడు అయ్యారని విమర్శించారు.

ఫార్ములా ఈ రేస్‌పై సీఎం తీరు వల్ల తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ యావత్ భారత్ తెలంగాణ వైపు చూసేలా చేసిందన్నారు. ఎక్కడో విదేశాల్లో జరిగే ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‍‌లో నిర్వహించడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారన్నారు.
RS Praveen Kumar
BRS
Telangana
Revanth Reddy

More Telugu News