Google Maps: గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అయ్యాడు... భారీ కంటెయినర్ లోయలోకి ఒరిగిపోయింది!

Container went into hills after following Google maps
  • కర్ణాటక నుంచి తాడిపత్రికి బయల్దేరిన భారీ కంటెయినర్
  • రాత్రి దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన డ్రైవర్
  • కొండల్లోకి తీసుకెళ్లిన గూగుల్ మ్యాప్స్
గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

కర్ణాటక నుంచి తాడిపత్రికి ఐరన్ లోడ్ తో ఉన్న భారీ కంటెయినర్ బయల్దేరింది. రాత్రి సమయంలో దారి తెలియక డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేశాడు. అది చూపిస్తున్న డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లాడు. చివరకు అది యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి తీసుకెళ్లింది. అక్కడ కంటెయినర్ ఒక లోయలోకి జారిపోయింది. చేసేదేమీ లేక ఫరూక్ ఈ విషయాన్ని ఓనర్ కు ఫోన్ చేసి తెలియజేశాడు. ఆ తర్వాత భారీ కంటెయినర్ ను జేసీబీల సాయంతో పైకి తీయించారు.
Google Maps
Anantapur District
Container

More Telugu News