Sonu Sood: ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అంబులెన్స్ లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్

Sonu Sood met CM Chandrababu and donates 4 ambulances
  • అమరావతి వచ్చిన సోనూ సూద్
  • చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ
  • 4 అంబులెన్స్ లను విరాళంగా ఏపీ ప్రభుత్వానికి అందజేత
  • సోనూ సూద్ ను అభినందించిన చంద్రబాబు
ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. 

సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నటుడు సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.

కాగా, నటుడు సోనూ సూద్ ఏపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌లు రెగ్యులర్ గా కనిపించే అంబులెన్స్‌ల తరహాలో కాకుండా, ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.  

Sonu Sood
Chandrababu
Ambulances
Donation
Andhra Pradesh

More Telugu News