Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrested Mastan Sai in Raj Tharun case
  • రాజ్ తరుణ్‌తో తాను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదు
  • ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
  • గతంలో డ్రగ్స్ కేసులోనూ అరెస్టైన మస్తాన్ సాయి
రాజ్ తరుణ్, లావణ్య కేసులో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాజ్ తరుణ్‌తో తాను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ - లావణ్య కేసులో ఈరోజు నార్సింగి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Raj Tarun
Lavanya
Hyderabad

More Telugu News