Raghu Rama Krishna Raju: పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది... ఎలాగంటే...!: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju interesting comments on Jagan
  • పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని వెల్లడి
  • కానీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వివరణ
  • ఓ ఎమ్మెల్యే అనుమతి లేకుండా 60 రోజులు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని వెల్లడి
  • జగన్ ఈసారి అసెంబ్లీకి రాకపోతే అనర్హతకు గురవుతాడని వ్యాఖ్యలు 
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అది ఎలాగో ఆయన వివరించారు. 

ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే... ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ తెలిపారు. ఈసారి గనుక జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం తథ్యమని అన్నారు. 

అయితే, జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తన గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.
Raghu Rama Krishna Raju
Jagan
Pulivendula
AP Assembly Session
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News