Radha Sapthami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లికి పోటెత్తిన భక్తులు

Radha Sapthami Today Devotees que in Tirumala and Arasavalli
   
నేడు రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభమవుతాయి.

అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. 7 గంటలకు ప్రారంభం కానున్న స్వామివారి నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
Radha Sapthami
Tirumala
Arasavalli
Lord Surya

More Telugu News