Mastan Sai: రాజ్ తరుణ్-లావణ్య కేసు: తొలిసారి నోరు విప్పిన మస్తాన్ సాయి

Big twist in Mastan Sai case revealed who in the videos
  • లావణ్య ఫిర్యాదుపై మస్తాన్ సాయి అరెస్ట్
  • అతడి హార్డ్ డిస్క్‌లో 200కుపైగా న్యూడ్ వీడియోలు
  • ఆ వీడియోల్లో ఉన్నది లావణ్య కాదన్న మస్తాన్ సాయి
సినీ నటుడు రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి నోరు విప్పాడు. తన హార్డ్ డిస్క్‌లో ఉన్న ప్రైవేట్ వీడియోల్లో ఉన్న మహిళల గురించి వెల్లడించాడు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ కాగా, నిన్న రాజ్ తరుణ్-లావణ్య కేసులో నార్సింగి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మస్తాన్ తన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని, రాజ్‌ తరుణ్‌కు, తనకు మధ్య విభేదాలకు అతడే కారణమని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.  

తన హార్డ్ డిస్క్‌లో ఉన్న ప్రైవేట్ వీడియోలపై తొలిసారి పెదవి విప్పిన మస్తాన్ సాయి.. వాటిలో ఉన్నది మరెవరో కాదని, తన భార్యేనని, కొన్ని వీడియోల్లో గాళ్ ఫ్రెండ్ కూడా ఉందని పేర్కొన్నాడు. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించినట్టు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ హార్డ్ డిస్క్‌లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు.
Mastan Sai
Raj Tarun
Lavanya
Private Videos

More Telugu News