Lavanya: లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్తాన్‌సాయి ప్రయత్నం: రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు

Police Remand Report on Masthan Sai
  • మస్తాన్‌సాయి డ్రగ్ సేవించి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు పేర్కొన్న పోలీసులు
  • గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు
  • హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు
రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్లు పేర్కొన్నారు. యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా చేర్చారు.

మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్‌సాయి డ్రగ్స్ సేవించి మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని తెలిపారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.

మస్తాన్‌సాయి లాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలో తొలగించాడు. అయితే, అంతకుముందే మస్తాన్‌సాయి ఆ వీడియోలను ఇతర డివైజ్‌లలోకి కాపీ చేసుకున్నాడు. లావణ్యను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హత్య చేయడానికి పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Lavanya
Masthan Sai
Hyderabad
Police

More Telugu News