offbeat: అరగంటే కనిపించి మాయమయ్యే దీవి.. మన దేశంలో ఎక్కడుందో తెలుసా?

this mysterious indian island only exists for 30 minutes daily and then disappears
  • సముద్రం అన్నాక దీవులు ఉండటం సాధారణమే.. కానీ ఇది ప్రత్యేకం
  • మహారాష్ట్ర సముద్ర తీరానికి సమీపంలో చిత్రమైన దీవి
  • దీవి పైకి తేలినప్పుడు బోట్లలో వెళ్లి చూసే అవకాశం
సముద్రం అన్నాక దీవులు ఉంటాయి. పెద్ద పెద్ద దీవుల్లో అడవులు, జంతువులు ఉంటాయి. మనుషులూ జీవిస్తూ ఉంటారు. కానీ రోజులో కొంత సేపు మాత్రమే కనిపించి, ఆ తర్వాత మాయమైపోయే దీవి ఒకటి ఉందని తెలుసా? అది కూడా మన దేశంలోనే అరేబియా సముద్ర ప్రాంతంలో ఉందని ఎప్పుడైనా విన్నారా? ఆ వివరాలు మీకోసం...

మహారాష్ట్ర తీరానికి సమీపంలో...
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లోని దేవ్ బాగ్ బీచ్ కు సమీపంలో అరేబియా సముద్రంలో ఈ చిత్రమైన దీవి ఉంది. రోజులో సుమారు అర గంట పాటు మాత్రమే ఈ దీవి సముద్రంపైన కనిపిస్తుంది. మిగతా సమయమంతా సముద్రంలో మునిగిపోయే ఉంటుంది. ఈ దీవి పేరు ‘సీగల్ ఐలాండ్’. స్థానికంగా మినీ థాయిలాండ్ అని కూడా పిలుస్తుంటారు.

రోజూ అరగంట సేపే కనిపించడం ఏమిటి?
సముద్రంలో రోజూ రెండు సార్లు అలలు, నీటి మట్టం ఒకటి రెండు మీటర్లు ఎగసిపడటం.. తర్వాత సాధారణం కంటే ఒకట్రెండు మీటర్లు తగ్గిపోవడం తెలిసిందే. వీటినే సముద్రపు ఆటుపోట్లు అంటారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రంలో ఈ ఆటు పోటు ఎదురవుతూ ఉంటాయి. ఇలా సముద్ర మట్టం గరిష్టంగా తగ్గిపోయే సమయంలో... సముద్రంపైన తేలుతూ కనిపించే దీవి ‘సీగల్ ఐలాండ్’.

ఆ పక్షులకు ప్రత్యేకం కావడంతో...
సముద్రంలో మునిగి, రోజులో కాసేపు బయటికి తేలే ఈ దీవిపై ‘సీగల్స్’గా పిలిచే సముద్రపు పక్షులు చేరుతూ ఉంటాయి. వాటితోపాటు కొన్ని ఇతర రకాల పక్షులూ ఆ కాసేపు ఈ దీవిపై వాలుతాయి. 

ఇది చాలా చిత్రమైన సంగతి. సముద్రంలో మునిగి, తేలుతూ ఉండే ఈ దీవిని చూడటానికి, ఇక్కడి పక్షులను చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. సరిగ్గా ఈ దీవి సముద్రం నుంచి బయటపడే సమయానికల్లా బోట్లలో దాని దగ్గరికి తీసుకువెళుతూ ఉంటారు.

విభిన్నమైన పర్యాటకాన్ని ఇష్టపడే వారు ఈ చిత్రమైన దీవిని సందర్శించేందుకు వెళ్లవచ్చు. దేవ్ బాగ్ బీచ్ నుంచి స్థానిక మత్స్యకారుల పడవలు, బోట్లలో దీవి వద్దకు వెళ్లవచ్చు. డిమాండ్ ను బట్టి ఒక్కొక్కరి వద్ద రూ.500 నుంచి రూ.800 వరకు చార్జి వసూలు చేస్తారు.
offbeat
Viral News
india
Seagull island
arabian sea

More Telugu News