Paytm App: పేటీఎం యాప్ లో మ‌రో కొత్త స‌ర్వీస్‌.. ఇక‌పై అగోడా హోట‌ల్ బుకింగ్స్ కూడా చేసుకోవ‌చ్చు!

Paytm Travel Agoda Partner to Offer Hotel Bookings on Paytm App
  • పేటీఎం బ్రాండ్‌పై సేవ‌లు అందిస్తున్న వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్ డిజిట‌ల్‌
  • ఈ సంస్థ‌తో జ‌త క‌ట్టిన‌ ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ అగోడా 
  • టూరిస్టుల‌కు భార‌త్ తో స‌హా ఇత‌ర దేశాల్లోని హోట‌ళ్ల బుకింగ్ ఆప్ష‌న్ 
  • ఇది కీల‌క ముంద‌డుగు అన్న‌ పేటీఎం ట్రావెల్ సీఈఓ వికాశ్ జ‌లాన్ 
పేటీఎం యాప్ లో మ‌రో కొత్త స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ యాప్ లో ఇక‌పై హోట‌ల్ బుకింగ్ సేవ‌లు కూడా పొందవచ్చు. దీనికోసం పేటీఎం బ్రాండ్‌పై సేవ‌లు అందిస్తున్న వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్ డిజిట‌ల్స్‌... ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ అగోడాతో ఒప్పందం చేసుకుంది. భార‌త్ తో స‌హా ఇత‌ర దేశాల్లోని హోట‌ళ్ల బుకింగ్ ఆప్ష‌న్ ను త‌న యాప్ ద్వారా అందించ‌నుంది. 

ఇక ఇప్ప‌టికే పేటీఎం ట్రావెల్ ద్వారా విమానం, రైలు, బ‌స్ టికెట్ బుకింగ్ స‌దుపాయాన్ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. పేటీఎం ట్రావెల్ లో హోట‌ల్ బుకింగ్ ఆప్ష‌న్ ను తీసుకురావ‌డం కీల‌క ముంద‌డుగు అని పేటీఎం ట్రావెల్ సీఈఓ వికాశ్ జ‌లాన్ తెలిపారు. 

ఈ భాగ‌స్వామ్యం ద్వారా స‌మ‌గ్ర సేవ‌లు అందించే సంస్థ‌గా అవ‌తారించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అటు పేటీఎంలో హోట‌ల్ బుకింగ్ ఆప్ష‌న్ ద్వారా టూరిస్టుల‌కు ఇక‌పై హోట‌ల్ బుకింగ్ అనేది మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌ని అగోడా అధికారి డామియ‌న్ పీచ్ చెప్పారు.     


Paytm App
Paytm Travel
Agoda
Hotel Bookings

More Telugu News