Mithun Reddy: లోక్ సభలో సీఎం రమేశ్ వ్యాఖ్యలకు మిథున్ రెడ్డి కౌంటర్

Mithun Reddy counters BJP MP CM Rameshn remarks in Lok Sabha
  • ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్ద లిక్కర్ స్కాం ఏపీలో జరిగిందన్న సీఎం రమేశ్
  • కాంట్రాక్టులు పొందడం కోసమే రమేశ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడన్న మిథున్ రెడ్డి
  • సీఎం రమేశ్ బీజేపీ కోసం పనిచేస్తున్నట్టుగా లేదంటూ విమర్శలు 
ఢిల్లీ లిక్కర్ స్కాంను మించి పోయేలా ఏపీలో అతి భారీ లిక్కర్ స్కాం జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇవాళ లోక్ సభ జీరో అవర్ లో ఆరోపించిన సంగతి తెలిసిందే. రూ.2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాంతో పోల్చితే అంతకు 10 రెట్లు లిక్కర్ స్కాం ఏపీలో జరిగిందని అన్నారు. 

అయితే, సీఎం రమేశ్ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికే సీఎం రమేశ్ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం రమేశ్ తీరు చూస్తుంటే ఆయన బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్నట్టు లేదని... టీడీపీ కోసం పనిచేస్తున్నట్టుందని విమర్శించారు. ఏపీలో మార్గదర్శి స్కామ్ అతి పెద్దదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. 
Mithun Reddy
CM Ramesh
AP Liquor Scam
Lok Sabha
YSRCP
BJP
TDP

More Telugu News