Guntur District: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మహిళల మృతి

RTC Bus hit auto carrying workers Several people died in guntur District
  • వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • గుంటూరు జిల్లా నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య ఘటన
  • గుంటూరు జీజీహెచ్‌కి క్షతగాత్రుల తరలింపు
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు ఆటోలో మిర్చి కోతల నిమిత్తం నీరుకొండ గ్రామానికి వెళ్తుండగా, వీరు ప్రయాణిస్తున్న ఆటోను నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతులను అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Guntur District
Road Accident
Crime News

More Telugu News