Rohit Sharma: క్యాచ్ మిస్ చేసిన రోహిత్‌.. అక్ష‌ర్‌కు త్రుటిలో చేజారిన హ్యాట్రిక్‌.. ఇదిగో వీడియో!

Rohit Sharma Livid with Himself Then Does This after Robbing Axar Patel of Hat Trick
  • దుబాయ్ వేదిక‌గా భార‌త్, బంగ్లా మ్యాచ్
  • సులువైన క్యాచ్ మిస్ చేసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
  • అక్ష‌ర్‌కు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ రికార్డు మిస్‌
  • భార‌త ఫీల్డ‌ర్ల త‌ప్పిదాల‌తో కోలుకున్న బంగ్లాదేశ్‌
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్ ను దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో ఆడుతున్న విష‌యం తెలిసిందే. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాకు భార‌త బౌల‌ర్లు నిప్పులు చెరిగే బంతుల‌తో చుక్క‌లు చూపించారు. దాంతో ఆ జ‌ట్టు మొద‌టి రెండు ఓవ‌ర్ల‌లోనే కేవ‌లం రెండు ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ష‌మీ, రాణా త‌మ తొలి ఓవ‌ర్ల‌లోనే వికెట్లు తీశారు. 

ఈ క్ర‌మంలో ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్‌ను స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ వేశాడు. రెండో బంతికే ఓపెన‌ర్ తంజిద్ (25)ను పెవిలియ‌న్ కి పంపించాడు. ఆ త‌ర్వాతి బంతికే ముష్ఫీక‌ర్ (0)ను ఔట్ చేశాడు. దాంతో నాలుగో బంతికి అక్ష‌ర్ హ్యాట్రిక్ మీద ఉన్నాడు. క్రీజులోకి వ‌చ్చిన కొత్త బ్యాట‌ర్ జాకర్ అలీ ఆ బంతిని ఎదుర్కొన్నాడు. 

అయితే, ఆ బంతి భారీ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ చేతుల్లో ప‌డింది. అత‌డు కూడా బంతిని అందుకొన్న‌ట్లే క‌నిపించాడు. కానీ, చివ‌రి క్ష‌ణంలో బంతి హిట్‌మ్యాన్ చేతిలోంచి జారిపోయింది. దీంతో అక్ష‌ర్ హ్యాట్రిక్ మిస్ అయిపోయింది. ఆ త‌ర్వాత తాను చేసిన పొర‌పాటుకు బౌల‌ర్ కి రోహిత్ సారీ చెప్పాడు. 

ఆ త‌ర్వాత కూడా భార‌త ఫీల్డ‌ర్లు వ‌రుస త‌ప్పిదాలు చేశారు. దాంతో కోలుకున్న బంగ్లా 39/5 ద‌శ నుంచి 189/5 కు చేరింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు హృదయ్ (85), జాకర్ అలీ (68) అర్ధ శ‌త‌కాల‌తో ఆరో వికెట్ కు ఏకంగా 154 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ప్ర‌స్తుతం క్రీజులో తౌహిద్ హృదయ్ (86), రిష‌ద్ హుస్సేన్‌ (0) ఉండ‌గా... బంగ్లాదేశ్ స్కోరు 192/6 (44 ఓవ‌ర్లు)          
Rohit Sharma
Champions Trophy 2025
Team India
Cricket
Sports News

More Telugu News