Pawan Kalyan: అపోలో ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకున్న పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan attend health checkup in Hyderabad Apollo Hospitals
 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అపోలో వైద్య సిబ్బంది పవన్ కు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పవన్ కు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

ఈ నెలాఖరున గానీ, మార్చి మొదటి వారంలో గానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకన్నారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. 
Pawan Kalyan
Health Checkup
Apollo Hospitals
Hyderabad
Janasena
Andhra Pradesh

More Telugu News