AP Budget 2025-26: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల... గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Payyavula Kesav introducing AP budget in Assembly
  • వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్న పయ్యావుల
  • కూటమికి ప్రజలు ఘన విజయాన్ని కట్టబెట్టారని వ్యాఖ్య
  • తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్న ఆర్థిక మంత్రి
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని చెప్పారు. అప్పులు తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేనంతగా పరిస్థితిని దిగజార్చారని అన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని మండిపడ్డారు. 

గత ప్రభుత్వం విపక్ష నేతలను అరెస్ట్ లు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పును వెలువరించారని, కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. సామాన్యుల సంతోషమే రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పారని... ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించామని చెప్పారు. 

తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ఆ సవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. జీతాలను కూడా చెల్లించలేని దీన స్థితికి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం తీసుకెళ్లిందని కేశవ్ విమర్శించారు.  గత ప్రభుత్వంలో అంతటా నిర్లక్ష్యం, విధ్వంసం అని ఆయన మండిపడ్డారు. 
AP Budget 2025-26
Payyavula Keshav
Telugudesam

More Telugu News