Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

Actress Hansika and Director Vamshi Paidipally Visited Tirumala Temple Today
  • తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న వంశీ పైడిప‌ల్లి, న‌టి హ‌న్సిక‌
  • ఈరోజు తెల్ల‌వారుజామున శ్రీవారి అభిషేక సేవ‌లో పాల్గొన్న ద‌ర్శ‌కుడు, న‌టి
  • వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ ఆలయ అధికారులు
ఈరోజు తిరుమ‌ల శ్రీవారిని ప‌లువురు సినీ ప్రముఖులు ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, న‌టి హ‌న్సిక, ఆమె భ‌ర్త‌ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున స్వామివారిని ద‌ర్శించుకుని, శ్రీవారి అభిషేక సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నం అనంత‌రం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వంశీ వెంట టీటీడీ బోర్డు స‌భ్యుడు, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.   

Tirumala
Hansika
Vamshi Paidipally
TTD
Andhra Pradesh

More Telugu News