Chandrababu: గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నాకే అర్ధం కావడం లేదు: సీఎం చంద్రబాబు

Chandrababu says the destruction in previous govt was not understand to him
  • చిత్తూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • జీడీ నెల్లూరులో ప్రజా వేదిక సభ
  • పేదల జీవితాల్లో వెలుగు రావాలనేదే తన ఆకాంక్ష అని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ఆయన ప్రసంగించారు. పేదల జీవితాల్లో వెలుగు రావాలనేదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నాకే అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని చంద్రబాబు వెల్లడించారు. 

ప్రతి నెల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అందే ప్రతి సేవ కూడా సెల్ ఫోన్ సాయంతో అందించేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. 

డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగుమందులతో వ్యవసాయంలో ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామని... అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని అన్నారు. 

"కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు నమోదు చేశాం. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి చేసే పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు. 

ఇక, నాగరిక ప్రపంచంలో పారిశుద్ధ్యం చాలా అవసరం అని అన్నారు. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పరిస్థితులు మెరుగుపరుస్తున్నామని... మరో రెండు నెలల్లో రహదారులపై గుంతలు పూడ్చడం పూర్తవుతుందని చెప్పారు.
Chandrababu
NTR Bharosa Pensions
GD Nellore
Chittoor District

More Telugu News