Gorantla Butchaiah Chowdary: పోసాని కృష్ణమురళిని కఠినంగా శిక్షించాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary comments on Posani Krishna Murali
  • పోసాని ఓ మూర్ఖ శిఖామణి అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • ఆడబిడ్డల గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు
  • జగన్ సర్కార్ చేసిన అప్పులను తమ ప్రభుత్వం తీర్చిందని వెల్లడి
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓ మూర్ఖ శిఖామణి అని టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎదుటివారి కుటుంబ సభ్యుల గురించి, వారి ఆడబిడ్డల గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిని కఠినంగా శిక్షించాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ సర్కార్ చేసిన రూ. 43 వేల కోట్లు అప్పులను తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. 

కూటమి ప్రభుత్వంలో ఏపీ బడ్జెట్ రూ. 3 లక్షల మార్క్ ను దాటిందని... ఆ ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. ఈసారి బడ్జెట్ లో అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయ, సంక్షేమ, అభివృద్ధి, పారిశ్రామిక, సేవా రంగాలకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు కేటాయించినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, తమ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రోడ్లను బాగుచేసిందని చెప్పారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Posani Krishna Murali
Tollywood

More Telugu News