AP High Court: ఆ ఖర్చును విజయసాయిరెడ్డి కూతురు నుంచి రాబట్టండి: ఏపీ హైకోర్టు

- వైజాగ్ భీమిలి వద్ద అక్రమ నిర్మాణాలపై విచారణ
- విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీపై ఆగ్రహం
- ఆ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన
విశాఖలోని భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. సీఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీచ్ లో గోడను తొలగించి ఆరు అడుగుల పునాదిని అలాగే వదిలేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులతో కమిటీ వేయాలని... గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణానికి జరిగిన నష్టాన్ని నేహారెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని ఆదేశించింది. ఆ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అప్పుడే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.