Chandrababu: తోడల్లుడు వెంకటేశ్వరరావు ప్రతి రోజూ ఏం చేస్తాడో చెప్పిన చంద్రబాబు

Chandrababu reveals his co brother Daggubati Venkateswararao
  • ప్రపంచ చరిత్ర పుస్తకం రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
  • నేడు విశాఖలో పుస్తకావిష్కరణ
  • హాజరైన సీఎం చంద్రబాబు
తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విశాఖలోని గీతం వర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వరావు గురించి చంద్రబాబు అనేక విషయాలు చెప్పి సభకులను నవ్వించారు. వాటిలో చాలామందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి.

ఇక, ఈ పుస్తకం గురించి తన కంటే ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్ని విషయాలు చెప్పేశారని చంద్రబాబు అన్నారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. రచయిత కానటువంటి వెంకటేశ్వరరావు రచయిత అయ్యారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ ప్రపంచ చరిత్ర పుస్తకం మీరే రాశారా? అని అడిగానని చంద్రబాబు తెలిపారు. ఎవరూ చేయనంత సాహసం ఆయన చేశారని వివరించారు. 

"వెంకటేశ్వరరావు జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే... ఆయన ఒక డాక్టర్. కానీ ప్రాక్టీస్ చేయలేదు. మంత్రి అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే అప్పుడు ప్రాక్టీస్ చేశాడు. మళ్లీ డాక్టర్ గా చేసి సినిమాలు తీశాడు. జీవితాలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మంత్రిగా ఉన్నాడు. ఒకసారి లోక్ సభకు వెళ్లాడు, రాజ్యసభకు వెళ్లాడు. 

ఇటీవల వెంకటేశ్వరరావును చూస్తే చాలా రిలాక్స్ డ్ గా కనిపించారు. ఆయన చాలా సరదాగా ఉండే మనిషి. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎంతో హుషారుగా ఉంటారు. ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అని ఇటీవలే కలిసినప్పుడు ఆయనను అడిగాను... నిద్ర లేవగానే బ్యాడ్యింటన్ ఆడతాను, మళ్లీ ఇంటికి వచ్చి మనవలతో ఆడుకుంటాను... ఆ తర్వాత ఫ్రెండ్స్ ను కలుస్తుంటాను అని చెప్పాడు. 

మళ్లీ మధ్యాహ్నం అయితే పేకాటకు కూడా వెళతాడట. అక్కడొక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది అని చెప్పాడు. హ్యాపీగా వచ్చి నిద్రపోతానని చెప్పాడు... పిల్లలకు రాత్రి పడుకునే ముందు ఒక కథ చెప్పి తాను కూడా నిద్రపోతాడు... వాట్ ఏ వండ్రఫుల్ లైఫ్! అటువంటి వ్యక్తి ఐదు పుస్తకాలు రాశాడు... అవన్నీ కూడా ఎంతో అధ్యయనం చేసి రాసిన పుస్తకాలు" అని చంద్రబాబు వివరించారు.
Chandrababu
Daggubati Venkateswararao
Book Launch

More Telugu News