Rukmini Vasanth: సాయిపల్లవి తరువాత ఆమె పేరే వినిపిస్తోందే!

Rukmini Vasanth Special
  • కన్నడ బ్యూటీగా యూత్ కి చేరువైన రుక్మిణీ వసంత్
  • ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటున్న అందం 
  • నటన ప్రధానమైన పాత్రల దిశగానే అడుగులు
  • తెలుగులోనూ బిజీ అయ్యే ఛాన్స్ 



సాయిపల్లవి... మంచి నటి... అంతకు మించిన డాన్సర్. తెలుగు సినిమా అభిమానులు హీరోల డాన్సుల గురించి మాత్రమే కాకుండా తన డాన్స్ గురించి మాట్లాడుకునేలా చేసిన ఆర్టిస్ట్. అటు మోడ్రన్ స్టెప్పులు... ఇటు క్లాసికల్ డాన్సుల విషయంలో ఆమె వేగాన్ని అందుకోవడం మిగతా హీరోయిన్స్ కి చాలా కష్టమైన విషయమే. పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపించే సాయిపల్లవి, తాను పోషించిన ప్రతి పాత్రకు ఒక పవిత్రతను తీసుకొస్తుంది.అయితే సాయిపల్లవి అన్నిరకాల పాత్రలు చేయదు. ఆమె ఎంచుకునే పాత్రలు బలమైనవిగా... విభిన్నమైనవిగా ఉంటాయి. ఏదైనా ఒక పాత్ర గురించిన ప్రస్తావన వస్తే, ఈ పాత్ర సాయిపల్లవి అయితే బాగుంటుందని ఆడియన్స్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఆమె కోసం కొన్ని కథలను .. పాత్రలను డిజైన్ చేస్తూ ఉండటంతో సాయిపల్లవి బిజీ అయిపోయింది. అందువలన సాయిపల్లవి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్న మేకర్స్ కి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ రుక్మిణీ వసంత్.రుక్మిణీ వసంత్ బెంగుళూర్ బ్యూటీ. గ్లామర్ క్వీనేమీ కాదు... కానీ సాయిపల్లవి మాదిరిగానే ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. కట్టూ... బొట్టూ... నవ్వు... నడక... ఇవన్నీ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. 'సప్తసాగరాలు దాటి' సినిమాతో యూత్ కి కనెక్ట్ అయిన ఈ సుందరి.. భగీరా, భైరతి రణగళ్ సినిమాలతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాల అనువాదాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. సాయిపల్లవి కుదరదని చెప్పిన ప్రాజెక్టులు రుక్మిణి వైపు వెళుతున్నట్టుగా టాక్. నటన ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే రుక్మిణీ, తెలుగులో నిలదొక్కుకుంటుందేమో చూడాలి మరి.

Rukmini Vasanth
Actress
Sai Pallavi

More Telugu News