Vontimitta: ఏప్రిల్ 11న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

TTD Chariman BR Naidu visits Vontimitta temple
  • నేడు ఒంటిమిట్ట  క్షేత్రంలో పర్యటించిన బీఆర్ నాయుడు
  • త్వరలో  శ్రీరామ నవమి... కల్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
  • ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక పరిశీలన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేడు వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇక్కడి కోదండ రామాలయంలోని కల్యాణ వేదికను పరిశీలించారు. 

త్వరలో శ్రీరామనవమి వస్తున్న నేపథ్యంలో, కల్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు స్పందిస్తూ, ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణం ఉంటుందని తెలిపారు. 

ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాలు, తలంట్రాలు అందజేస్తారని వివరించారు. సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు.
Vontimitta
Lord Rama Temple
BR Naidu
TTD

More Telugu News