Yujwendra Chahal: మరోసారి ఆర్జే మహ్వశ్ తో కనిపించిన టీమిండియా క్రికెటర్ చహల్

Chahal spotted with RJ Mahvash again
  • భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకుంటున్న చహల్!
  • తరచుగా మరో అమ్మాయితో కనిపిస్తున్న భారత లెగ్ స్పిన్నర్
  • నిన్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు ఇద్దరూ హాజరు
  • టీమిండియాకు గుడ్ లక్ చెబుతూ సెల్ఫీ వీడియో
భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వైవాహిక జీవితం ఏమంత సాఫీగా లేదన్న సంగతి తెలిసిందే. భార్య ధనశ్రీ వర్మ, చహల్ విడాకులు తీసుకుంటున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇరువురు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. 

అయితే, చహల్ గత కొంతకాలంగా తరచుగా మహ్వశ్ అనే అమ్మాయితో  కనిపిస్తున్నాడు. మహ్వశ్ ఓ రేడియో జాకీ. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కూడా. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చహల్, మహ్వశ్ నిన్న దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను కలిసి వీక్షించారు. 

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరువురు టీమిండియాకు బెస్ట్ విషెస్ చెబుతూ ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోను మహ్వశ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది. దాంతో మరోసారి వీరిద్దరి రిలేషన్ వార్తల్లోకెక్కింది.
Yujwendra Chahal
RJ Mahvash
Dhansri Varma
Team India

More Telugu News